ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..!

ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..!

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కుటుంబ కలహాలతో ఓ జంట మంగళవారం పురుగుల మందు తాగి మృతి చెందారు. మృతులు ఆలం స్వామి, ఆలం అశ్విని 15 రోజులుగా కలిసి జీవనం సాగిస్తున్నారు. అశ్వినికి ఇదివరకు వేరొకరితో పెళ్లి కాగా ఒక కుమారుడు ఉన్నాడు. దీంతో మొదటి భర్త కుల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించి రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. కుల పెద్దలు అంతా కలిసి తప్పు జరిగింది కాబట్టే స్వామిని రెండు లక్షలు కట్టాలని ఒప్పించినట్టు తెలిసింది. దీనిని మొదటి భర్త ఒప్పుకోకుండా పోలీస్ స్టేషస్‌లో కేసు పెట్టినట్లు సమాచారం. దీంతోనే భయపడి పోయిన ఇరువురు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..!”

Leave a comment