గుడుంబా స్థావరాలపై వెంకటాపురం పోలీసుల మెరుపు దాడులు.
– వందలాది లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.
– పరారైన దొంగ సార వ్యాపారులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురంమండల పరిధి బెస్తగూడెంలో సీ.ఐ. వెంకటాపురం బండారి కుమార్ ఆధ్వర్యంలో, ఎస్సై తిరుపతి రావు, ఎస్సై అశోక్ , వెంకటాపురం పోలీస్ సిబ్బంది,మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. మండల పరిధి లోని బెస్త గూడెం గ్రామం లో గుడుంబా తయారిస్తా వరాల పైన దాడులు నిర్వహించడమైనది. ఇందులో భాగంగా దుర్గం రాము, జిమ్మిడి పుల్లారావు ల నుంచి 1,000 లీటర్ల గుడుంబా తయారీ పానకంను ధ్వంసం చేయడం జరిగినది. అదే విధంగా గుడుంబా తయారీకి ఉపయో గించే వస్తువులను ధ్వంసం చేయడం జరిగింది. వారి పైన కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది. వెంకటాపురం మండల ప్రజలకు తెలి యజేయునది ఏమనగా మండలం ఎక్కడైనా గుడుంబా తయారు చేసినట్ల యితే వారికి సంబంధించిన సమాచారం ను వెంటనే వెంకటాపురం పోలీస్ శాఖ వారికి తెలియ పరచగలరని ,వారి పేర్లు వారి వివరాలను గోప్యంగా ఉంచబడ తాయని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారుల సెల్ ఫోన్ నెంబర్లను ప్రజలకు విడుదల చేశారు.
ఎస్సై వెంకటాపురం: ఫోన్ నెంబర్-8712670098,
పి.ఎస్. వెంకటాపురం ఫోన్ నెంబర్-8712670099,
పై నంబర్లకు సమాచార ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు.