పాలెం ప్రాజెక్టు సాగునీటి కోసం రోడ్ ఎక్కిన రైతన్నలు. 

పాలెం ప్రాజెక్టు సాగునీటి కోసం రోడ్ ఎక్కిన రైతన్నలు. 

నాలుగు గంటల పాటు భారీ రాస్తారోకో – స్తంభించిన రాకపోకలు. 

– రోడ్డుపైనే పడుకొని ఆదివాసి రైతుల నిరసన. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం ప్రాజెక్టు ఆయ కట్టు కు సాగునీటి సరఫరా లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని పాలెం ప్రాజెక్టు ఇంజ నీరింగ్ అధికారులను సస్పెండ్ చేసి, పంటలకు ప్రాజెక్టు సాగునీటిని అందిం చాలని డిమాండ్ చేస్తూ, శనివారం మండల పరిధిలోని చిరుతపల్లి గ్రామం వద్ద ప్రధాన రహదారిపై బర్ల గూడెం పంచాయతీ పరిధిలోని ఆది వాసి రైతులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ, రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా జరిగిన రాస్తారోకో , ధర్నా కారణంగా నాలుగు గంటల పాటు వెంకటాపురం నుండి వాజేడు వైపు అటువైపు నుండి ఇటు వైపు వచ్చే పోయే వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. సుమారు పదివేల ఎకరాల కు సాగునీరు అందించే పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు మరమ్మ తులు లేకపోవడంతో రిజర్వాయర్లో నీరు ఉన్న పంట పొలాలకు అందటం లేదని ఫలితంగా మిర్చి, మొక్కజొన్న, ఖరీఫ్ ,రబీ వరి పంటలు ఇతర పంటలు ఎండిపోతున్నాయని, బర్లగూడెం పంచాయతీ గ్రామాల ఆదివాసి రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆదివాసీ నవనిర్మాణ సేన ఎఎన్ఎస్ ఆధ్వర్యంలో, బర్లగూడెం సర్పంచ్ కొరస నరసింహమూర్తి ,ఏఎన్ఎస్ రాష్ట్ర నేత నాగరాజు, రైతులు, మాజీ సర్పంచ్ మిచ్చా వెంకటమ్మ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఆదివాసి రైతులు పెద్ద సంఖ్యలో ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలెం ప్రాజెక్టు డి.ఇ , ఏ. ఈ లను సస్పెండ్ చేయాలని, వేసిన పంటలు ఎండిపోకుండా తక్షణమే నీటిని విడుదల చేసి,కాలువలుకు పూడికలు తీ ఇంచి మరమ్మతులు చేయాలని, రైతులు డిమాండ్ చేశారు. దశాబ్దం పైగా కాలంగా పాలెం ప్రాజెక్టును పట్టించు కోకపోవడంతో, పంట పొలాలకు అందవలసిన సాగునీరు వాగుల గుండా వ్రుధాగా గోదావరిలో కలుస్తున్నదని, ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే, ఆయకట్టు రైతుల పంటలు ఎండిపోయి, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నదని రైతులు నినాదాలు చేశారు. సుమారు 14 కిలోమీటర్ల పొడవున్న ప్రాజెక్టు కుడి కాలువ మరమ్మత్తులు లేకపోవడంతో పూడికలు కారణంగా నీరు ప్రవహించడం లేదని,కాలువలకు బుంగలపడి నీరు వృధాగా వాగుల గుండా గోదావరి లో కలుస్తున్నదని, వేసిన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండు టెండలో సైతం రైతులు బి.టి. రోడ్డుపై పడుకొని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికా రులు వెంటనే వచ్చి సమాధానం చెప్పాలని అప్పటివరకు రోడ్డుపై నుండి లేచేది లేదంటూ పట్టుపట్టారు. సమాచారం తెలుసు కున్న వెంకటాపురం పోలీసులు తొలుత ఏఎస్ఐ సిబ్బంది వచ్చి ఆందోళనకారులతో చర్చలు చేసిన ఫలితం లేకుండా పోయింది. అనంతరం వెంకటాపురం ఎంపీడీవో ఏ. బాబు సివిల్ పోలీస్ ఎస్.ఐ. తిరుపతిరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య లు రాస్తా రోకో ప్రాంతానికి చేరుకున్నారు. పాలెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారి కార్తిక్ సైతం ధర్నా వద్దకు చేరుకొని ఆందోళనకారులతో, అధికారుల సమక్షంలో చర్చలు జరిపారు. కాలువల పూడిక తీత పనులను గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్వహించాలని, నీటిపారుదల శాఖలో బడ్జెట్ లేదని ఏ.ఈ కార్తీక్ తెలిపారు. అలాగే రైతుల ఆందోళనలను ఇంజనీరింగ్ ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్తానని, సోమవారం ప్రాజెక్టు సమస్యను విన్నవించి, న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అలాగే ప్రత్యేక నిధులు మంత్రి గారి ద్వారా మంజూరు చేసే విధంగా క్రుషి చేయాలని కోరారు. రైతులు కు పూర్తిస్థాఇలో సహకారం చేస్తామని ఇంజనీరింగ్ అధికారి కార్తీక్ ఆందోళన కారులకు, రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాలుగు గంటల పాటు జరిగిన రాస్తారోకో ఆందోళనలతో రాకపోకలు స్తంభించి పోయాయి. అధికారులతో చర్చలు జరుపుతున్న సమయంలో, పదివేల ఎకరాలకు సాగునీరు అందించ లేని ప్రాజెక్టు ఎందుకని, ఇంజనీరింగ్ అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారని, ఏ ఊర్లో ఉంటున్నారని సరైన సమాధానం చెప్పాలని , సర్పంచ్ నరసింహమూర్తి, రాష్ట్ర నేత నాగరాజు రైతులు అధికారులను నిలదీశారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు జవాబు చెప్తారని, ప్రాజెక్టు నీరు అందక సుమారు 4,000 వేల ఎకరాల వరి పంటలు ఖరీఫ్ లో ఎండిపోయాయని, రైతులు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తున్నారా అంటూ అధికారులు నిలదీయ డంతో, ధర్నా రాస్తారోకో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెల కున్నాయి. ఈ సందర్భంగా రైతులు అధికారులపై విరుచుకు పడ్డారు. శాంత పరిచి సోమవారం రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖ, ఎంపీడీవో ఇతర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పంట పొలాలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకుంటామని, అధికారులు హామీ ఇవ్వడంతో 4 గంటల పాటు జరిగిన రాస్తారోకో ధర్నా కార్యక్రమాలను బర్లగూడెం పంచాయతీ ఆదివాసి రైతాంగం విరమించు కుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment