ఆర్ఎస్ఎస్, బీజేపీల ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం
– ఏప్రిల్ 8న కలెక్టరేట్ ముందు ధర్నా
– సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పిలుపు
నిజామాబాద్,తెలంగాణజ్యోతి:బీజేపీ,ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను నిరసిస్తూ ఈనెల 8న దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాలు మోడీ ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృత్తో ఉన్నా రన్నారు. భారత కార్మిక వర్గం ఉద్యోగ భద్రతకోసం, కార్మిక చట్టాల కోసం, రైతులు ఎంఎస్పీ కోసం, గిట్టుబాటు ధరల చట్టపరమైన హామీ, రుణమాఫీ కోసం, నిరుపేద రైతులు భూమి కోసం పోరాడుతున్నారన్నారు. అదివాసీలు, అటవీ హక్కుల చట్టం 2006 అమలు కోసం జల్ జంగల్-జమీన్’ రక్షణ కోసం పోరాడుతన్నారన్నారు. యువత సురక్షితమైన ఉపాధి కోసం, విద్యార్థులు, సార్వత్రిక, ఉచిత, లౌకిక, శాస్త్రీయ విద్య కోసం మహిళలు, భద్రత, సమానత్వం కోసం ఆందోళనలు నిర్వహిస్తు న్నారన్నారు. మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు జీవన భద్రత, జీవనోపాధి కోసం, రాష్ట్రాలు సమాఖ్యవాదం కోసం, చిన్న, మధ్యతరహా వ్యాపారులు వారి అభివృద్ధి కోసం పోరాడుతున్నా రన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించ కుండా, ప్రజల్లో కుల, మతోన్మాదాలను రెచ్చగొట్టి, తన కాషాయ, కార్పొరేట్ విధానాలను అమలు చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మతత ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు బలమైన ప్రజా ఉద్యమా లను నిర్మించాలన్నారు. ఈనెల 8న దేశవ్యాప్త ఆందోళనలకు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జాతీయ కమిటీ పిలుపునిచ్చిం దన్నారు. ఈనెల 8న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాల యం ముందు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తు న్నామని, ఈ ధర్నా ను జయప్రదం చేయాలని జిల్లాలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్ బోధన్ డివిజన్ కార్యదర్శి డి.రాజేశ్వర్ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న, నగర కార్యదర్శి ఎం.సుధాకర్ జిల్లా నాయకులు సీ.హెచ్ సాయన్న, పి.సాయన్న తదితరులు పాల్గొన్నారు.