మేడారం జాతర భక్తుల పుణ్య స్నానాలకు లక్నవరం నీరు విడుదల

On: January 25, 2026 10:19 PM

మేడారం జాతర భక్తుల పుణ్య స్నానాలకు లక్నవరం నీరు విడుదల

మేడారం జాతర భక్తుల పుణ్య స్నానాలకు లక్నవరం నీరు విడుదల

 భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచన

ములుగు ప్రతినిధి, జనవరి 25,  తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో జరుగుతున్న అతిపెద్ద గిరిజన జాతరకు మేడారం సమ్మక్క సారలమ్మల చెంతకు తరలివచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించేం దుకు లక్నవరం సరస్సు నీరు విడుదలైంది. ఆదివారం గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు నుంచి ఇరిగేషన్ ఇరిగేషన్ ఈఈ నారాయణ, డీఈ రవీందర్ రెడ్డి తదితర అధికారులు నీరు విడుదల చేశారు. సరస్సు ఆయకట్టులోని వ్యవసాయ భూములకు తైబందీ ఖరారు చేయగా 5650ఎకరాల యాసంగి పంటకు నీరు కేటాయించిన విషయం తెలిసిందే. అందుకు పోను ఈనెల 28 నుంచి 31వరకు జరిగే మహాజాతర కోసం కూడా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీటి విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!