బొగత జలపాతాన్ని సందర్శించిన కొత్తగూడెం జూనియర్ సివిల్ జడ్జి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కొత్తగూడెం జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు కుటుంబ సభ్యులు, కోర్టు సిబ్బందితో ఆదివారం ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతాన్ని సందర్శించారు. తెలంగాణ నయాగారాగ పేరుగాంచిన బొగత జలపాతం ప్రకృతి రమణీయ దృశ్యాలను తిలకించి ఆనందిం చారు.జూనియర్ సివిల్ జడ్జి బి. రామారావును వెంకటా పురం న్యాయవాది బాహుబలేంద్రుని నటరాజ పూర్ణచందర్ రావు బొగత వద్ద మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలుకుతూ శుభాభినందనలు తెలిపారు.