Kerala, Ayyapa :  పెద్దపాదం అటవీ మార్గం భక్తులకు రేపటి నుంచి ప్రత్యేక పాస్

On: December 17, 2025 8:33 PM

Kerala, Ayyapa :  పెద్దపాదం అటవీ మార్గం భక్తులకు రేపటి నుంచి ప్రత్యేక పాస్

Kerala, Ayyapa :  పెద్దపాదం అటవీ మార్గం భక్తులకు రేపటి నుంచి ప్రత్యేక పాస్

స్వాగతిస్తున్న భక్తులు

డెస్క్, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ఎరుమేలి మీదుగా సాంప్రదా య పెద్దపాదం అటవీ మార్గం గుండా నడిచివెళ్లి శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని చేరుకునే భక్తులకు రేపటి నుంచి ప్రత్యేక పాస్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ముకుళి వద్ద ఈ పాస్‌ల పంపిణీ జరగనుండగా, అటవీ శాఖ ద్వారా పాస్‌లు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం భక్తులు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్‌కు పరిష్కారంగా తీసుకున్న చర్యగా పేర్కొనబడింది. సన్నిధానం చేరుకునేందుకు 50 కిలోమీటర్లకు పైగా నడిచివచ్చే భక్తులు గతంలో సుదీర్ఘంగా క్యూలలో వేచిచూడాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రత్యేక పాస్ ప్రవేశపెట్టడంతో ఆ ఇబ్బందులు తొలగి, యాత్రికులకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఏర్పాట్ల ప్రకారం, పెద్దపాదం అటవీ మార్గం ద్వారా వచ్చే భక్తులను మరకూట్టం నుంచి చంద్రనందన్ రోడ్డు, నడపండల్ మార్గంగా ప్రత్యేక క్యూలోకి పంపిస్తారు. తద్వారా భక్తులు నేరుగా 18 పవిత్ర మెట్లను అధిరోహించే అవకాశం కల్పించనున్నారు. ఈ విధానం రేపటి నుంచి సన్నిధానంలో అమల్లోకి రానుంది. వేలాది మంది అయ్యప్ప భక్తులకు ప్రయాణాన్ని సులభతరం చేసే ఈ నిర్ణయాన్ని భక్తులు విస్తృతంగా స్వాగతిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!