నోరు అదుపులో పెట్టుకో పుట్ట మధు..

On: December 25, 2025 4:12 PM

నోరు అదుపులో పెట్టుకో పుట్ట మధు..

నోరు అదుపులో పెట్టుకో పుట్ట మధు..

– కాటారం కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

– చెక్ డ్యాంల అవినీతి ఆరోపణలపై ఘాటు ప్రశ్నలు

– అసత్య ప్రచారాలు మానుకోవాలని డిమాండ్

కాటారం, డిసెంబర్ 25 (తెలంగాణ జ్యోతి): మానేరులో నిర్మించిన చెక్ డ్యాంలు ఆశాస్త్రీయంగా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కేవలం దోచుకునే ఉద్దేశంతోనే నిర్మించారని, ఈ అంశాన్ని ఆనాడే అసెంబ్లీ సాక్షిగా నేటి మంత్రి, నాటి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని కాటారం కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. గురువారం కాటారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ దండు రమేష్, మండల ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, మంథని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య తదితరులు మాట్లాడుతూ అడవి సోమన్‌పల్లి వద్ద చెక్ డ్యాం కూలిపోవడంతో పాటు మొత్తం 13 చెక్ డ్యాంలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన వాస్తవం ప్రజల ముందే ఉందని, సుమారు రూ.500 కోట్లకు పైగా ప్రజాధనం నాణ్యత లేకుండా ఖర్చు చేసి మూడు సంవత్సరాల్లోనే నిర్మాణాలు కూలితే కాంగ్రెస్ కూల్చిందని ఆరోపించడం అసత్యమని మండిపడ్డారు. చెక్ డ్యాంల పేరిట ప్రమాణాలు పాటించకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అవినీతిపై విచారణ జరిపించాలని ఆనాడే డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పుట్ట మధు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధిగా మాట్లాడేటప్పుడు మాటల్ని అదుపులో పెట్టుకుని సభ్యతతో వ్యవహరించాలని హెచ్చరిస్తూ, తమ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. మంథని ప్రాంత ప్రజలు నిజాలను తెలుసుకున్నారని, అందుకే ప్రతిసారి శ్రీధర్ బాబునే భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారని పేర్కొంటూ, అసత్య ప్రచారాలు మానుకోవాలని, చట్టపరిధిలో ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని కాటారం కాంగ్రెస్ నాయకులు స్పష్టంగా హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!