వెంకటాపురంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సాధించి పదేళ్లలో అభివృద్ధి పథంలో నిలబెట్టిన కారణ జన్ముడు, మాజీ సి.ఎమ్. కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70వ పుట్టినరోజు సందర్భంగా , స్థానికఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద, కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా, సీనియర్ నాయకులు వేల్పూరి లక్ష్మీనారాయణ , చేతుల మీదుగా కేక్ కట్ చేయించి, హర్షద్వానాల మధ్య కెసిఆర్ జన్మ దినం వేడుకలను నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు .ఈ కార్యక్రమంలో బిఆర్ఎ స్ సీనియర్ జిల్లా నాయకులు గూడవర్తి నరసింహమూర్తి, మండల అధ్యక్షులు గంపా రాంబాబు, ప్రధాన కార్యదర్శి పిల్లారిసెట్టి మురళి, అధికార ప్రతినిధి డర్రా దామోదర్, సీని యర్ ఉద్యమ నాయకులు చిడేం రవికుమార్, ముడుంబా శ్రీనివాస్,చిడెం రవి, ఉపాధ్యక్షులు జాగర శివాజీ యాదవ్, జాగర శాంతమూర్తి యాదవ్, బొల్లె శంకర్రావు, మాజీ సర్పంచ్లు నారాయణమ్మ,సమ్మయ్య, అచ్చా నాగేశ్వరరావు, శ్రీను, నెహ్రూ, మహిళా అధ్యక్షురాలు పెనుమత్స మాధురి, మాజీ అధ్యక్షురాలు జానకమ్మ, కృపావతి, తదితరులు పాల్గొన్నారు.