శ్రీధర్ బాబు మెప్పుల కోసం తిప్పలు పడుతున్న కాటారం కాంగ్రెస్ నాయకులు

శ్రీధర్ బాబు మెప్పుల కోసం తిప్పలు పడుతున్న కాటారం కాంగ్రెస్ నాయకులు

– నియోజకవర్గానికి ముఖ్యమంత్రిని తీసుకువచ్చి అభివృద్ధికి ఏమాత్రం నిధులు తీసుకొచ్చావు శ్రీధర్ బాబు

– దళిత ఎంపీకి జరిగిన ప్రోటోకాల్ అవమానం వెనకాల మంత్రి మరియు ఎండోమెంట్ అధికారిని హస్తముంది

– కాలేశ్వరం గ్రామ ఎంట్రన్స్ కు వసూలు చేస్తున్న టోల్ లో నీతమ్ముని వాటా ఎంత శ్రీధర్ బాబు

కాటారం, తెలంగాణ జ్యోతి: కాటారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశంలో మండల ఇంచార్జ్ జోడు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధు కాలేశ్వరం వచ్చి శ్రీపాద ట్రస్ట్ ద్వారా ఏం సేవ చేస్తున్నాడు ఇక్కడ మంత్రి అని ఎద్దేవా చేయడంతో ఆలోచనలో పడ్డ మంత్రి నిన్నటి నుండే అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. సరస్వతీ పుష్కరాలు ప్రారంభమై ఎనిమిది రోజులు అవుతున్న చివరి మూడు రోజులకే మాత్రమే భక్తులకు అన్నదానం పెట్టాలని ఎందుకు అనిపించింది? ప్రజలలో నుండి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికేనా, పవిత్రమైన పుష్కరాలను కాంట్రాక్టుల పేరుతో కార్యకర్తలకు దోచిపెట్టడానికే ఏర్పాటు చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. యూత్ అధ్యక్షులు రామిళ్ళ కిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు వేరే ఏ సమస్యలు లేనట్టు ప్రభుత్వం దృష్టికి నాయకుల దృష్టికి పుట్టమదన్న ఏ సమస్య అయితే తీసుకువెళ్తారో దాన్ని,నిత్యం పట్టుకుని వాళ్ళ నాయకుని మెప్పు పొందడానికి కాంగ్రెస్ కార్యకర్తలు పాటుపడుతున్నారని, ఈ విధంగా కార్యకర్తలు వాల్ల సార్ మెప్పు పొందడానికి తోటి దళితుడిని కూడా అవమానపరిస్తే స్పందించడం లేదని, మీలాంటి వాళ్లు బానిసత్వంలో మగ్గుతూ తోటి దళితులకు బాసటగా నిలవడం లేదని బహుజన నాయకుడైన పుట్ట మధు ఎంపీ వంశీకృష్ణ కోసం పార్టీలను చూడకుండా నేరుగా ప్రభుత్వ అధికారులను పాలకవర్గ మంత్రిని, ఎంపి ఫోటో ప్రోటోకాల్లో మర్చిపోవడంపై హెచ్చరించాడని పేర్కొన్నారు. తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మంథని నియోజకవర్గానికి వచ్చి 500 కోట్లు 1000 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి ప్రకటిస్తాడని ఆశపడితే ఉట్టి చేతులతోటి వచ్చి చేతిలో కాలేశ్వరం ప్రసాదం పట్టుకొని వెళ్ళాడని ఎద్దేవా చేశాడు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి మా సార్ అని స్థానిక కాంగ్రెస్ నాయకులు జబ్బలు చర్చుకుంటారు కానీ ముఖ్య మంత్రిని తీసుకువచ్చి ఒక్క రూపాయి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకురాలేకపోయిన చేతగాని మంత్రిగా శ్రీధర్ బాబు గారు నిలిచిపోయారని దుయ్యబట్టారు. ఇకనుండి అయినా పుట్టమధు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మండల నాయకులు జక్కు శ్రావణ్ మాట్లాడుతూ పుష్కరాలకు ఆదరణ కరవై నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన బస్సులను పంపించి ఫ్రీ బస్సులనీ ప్రచారం చేసి మధ్యాహ్నం లంచ్ అని చెప్పి తిరుగు ప్రయాణంలో కూలీ డబ్బులు ఇస్తారని చెప్పి పుష్కరాలను విజయవంతం చేయడానికి ఆపసోపాలు పడుతున్నడు శ్రీధర్ బాబు అంటూ ఆరోపణ చేశారు, కాలేశ్వరం పుష్కరాలలో వడదెబ్బతో మృతి చెందిన మంతెన శ్రీనివాస్ మరణాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు అనారోగ్యం బాగా లేక చనిపోయాడు తప్ప విధులలో చనిపోలేదన్నట్లు మీడియా సమావేశంలో తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ శవాల మీద పేలాలు ఏరుకునే మీరే ఈ విధంగా మాట్లాడితే ఎలా? తక్షణం ఆకుటుంబానికి ఎక్స్గ్రేషియా మరియు ఉద్యోగం రాష్ట్రమంత్రి ముందుండి ఇప్పించాలని డిమాండ్ చేశారు, కాలేశ్వరం దేవస్థానం చుట్టూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తన ప్రైవేటు కాంగ్రెస్ సైన్యాన్ని పెట్టుకొని ఎండోమెంట్ వారికి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ ప్రజలు క్యూ లైన్ ల ద్వారా ఎలా అయితే వెళ్తారో అలా కాంగ్రెస్ కార్యకర్తలను దర్శనానికి వెళ్ళనీయకుండా నేరుగా గర్భగుడిలోకి తీసుకెళ్లి మళ్ళీ బయటికి పడగొట్టేంతవరకు కాంగ్రెస్ కార్యకర్తలు వాకీటాకీలతో పనిచేస్తున్నారని, దీనివల్ల ఎండోమెంట్ ఆదాయం దెబ్బతింటుందని ప్రభుత్వ అధికారులకు గుర్తు చేశారు, దేశంలో ఏ ప్రాంతంలో లేని విధంగా దైవ దర్శనానికి వచ్చే భక్తుల వద్ద నుండి విలేజ్ ఎంట్రన్స్ టోల్ అని చెప్పి, మంత్రి మరియు ఆయన తమ్ముడు ఇద్దరూ కలిసి వాటాల కోసం మరియు కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి ఆ టోల్ వసూలు చేపిస్తున్నారని గతంలో జిల్లా కలెక్టర్ టోల్ వసూలు చేయొద్దని పత్రికాముఖంగా చెప్పినప్పటికీ మళ్లీ మూడు రోజుల నుంచి వసూలు చేస్తున్నారని దీనిలో భారీగా మంత్రి తమ్మునికి ముడుపులు ముట్టాయని తక్షణం దీనిపై కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. మిగతా రెండు రోజులైనా కాలేశ్వరం గ్రామంలోకి ఎంట్రీ టోల్ లేకుండా వెంటనే వారిని టోల్ వసూలను నిలుపుదల చేయాలని ప్రభుత్వ అధికారులను వేడుకోవడం జరిగింది. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ కాటారం ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొండ గొర్ల వెంకటస్వామి, పార్టీ సీనియర్ నాయకులు నరివెద్ది శ్రీనివాస్, కొండపర్తి రవి,టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment