కేంద్ర ప్రభుత్వ ములుగు జిల్లా ప్యానెల్ కౌన్సిల్‌గా కన్నోజు సునీల్ కుమార్
ములుగు, డిసెంబర్ 24, తెలంగాణ జ్యోతి : జిల్లా కోర్టులో కేంద్ర ప్రభుత్వ తరపున కేసులను వాదించేందుకు ములుగు జిల్లాకు చెందిన కన్నోజు సునీల్ కుమార్ ను జిల్లా ప్యానెల్ కౌన్సిల్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ముగ్గురు న్యాయవా దులను జిల్లా ప్యానెల్ కౌన్సిల్ గా నియమించగా, అందులో సునీల్ కుమార్‌కు మూడేళ్ల కాలపరిమితితో బాధ్యతలు అప్పగించారు. 2009 నుండి న్యాయవాదిగా నమోదు చేసుకుని జిల్లా కోర్టులో సుదీర్ఘ అనుభవంతో సేవలందిస్తున్న ఆయన నియామకంపై న్యాయవాద వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ అవకాశాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.





