కన్నాయిగూడెం మండలం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి

Written by telangana jyothi

Published on:

కన్నాయిగూడెం మండలం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి

– జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ.

– ఆస్పిరేషనల్ బ్లాక్ మండలంగా కన్నాయిగూడెం ఎంపిక. 

– ఘనంగా సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ప్రారంభం..

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు అధికారులు లు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ అన్నారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ , నీతి ఆయోగ్ ప్రొఫెషనల్ అధికారిని గాయత్రి తో కలిసి కన్నాయిగూడెం ఆస్పిరేషనల్ బ్లాక్ మండలంలో సంపూర్ణ అభియాన్ కార్యక్ర మాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ములుగు జిల్లాలో కన్నాయిగూడెం మండలం ఆస్పిరేషనల్ బ్లాక్ మండలంగా ఎంపికైందని దానిలో భాగంగా సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని జూలై 4 వ తేది నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా సూచించిన ఆరు సూచికలను ప్రామాణికంగా తీసుకొని పూర్తిగా మండలంలో అమలు చేయాలని, ఆస్పిరేషనల్ బ్లాకు ఇన్స్పిరేషనల్ బాక్స్లుగా మార్చడానికి అన్ని రంగాల్లో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడానికి నీతి ఆయోగ్ సూచించిన 6 సూచికలను మూడు నెలల ప్రణాళిక లో 100% అమలు పరిచడానికి సంపూర్ణత అభియాన్ మంచి కార్యక్రమం అని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ అందించిన సూచికల్లో ముఖ్యంగా వైద్యరంగం, పౌష్టికాహారం, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం ఈ నాలుగు రంగాల్లో కన్నాయిగూడెం మండలంలోని ప్రజల కు అందించడానికి నీతి ఆయోగ్ మూడు నెలల సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. వైద్యరంగంలో ప్రతి గర్భిణీ తన మొదటి త్రైమాసికంలో దగ్గర్లో ఉన్న సబ్ సెంటర్లో లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదు చేసుకుని గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పూర్తిగా తెలుసుకోవాలని దీని ద్వారా తల్లి మరియు జన్మించే శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. 30 సంవత్సరాలు పైబడిన మండలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బిపి మరియు డయాబెటిస్ పరీక్షలు చేసుకుని దానికి సంబంధించిన ఆరోగ్య మరియు వైద్య నియమాలు పాటించి ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు. పౌష్టికాహార రంగంలో ప్రతి గర్భిణీ మహిళా ఉన్న అంగన్వాడి తనకు అందించే సప్లమెంటరీ న్యూట్రిషన్ అందుకొని తాను మరియు జన్మనిచ్చే శిశువుకి సంపూర్ణ ఆరోగ్యానికి నాంది పలకడానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రతి ఒక్క రైతు నీళ్లలో ఉన్న లవణా లను గుర్తించి వాటికి సంబంధించి పంటలు వేసుకోవడానికి , వారి వ్యవసాయ భూముల్లో నేల పరీక్షలు చేసి ఆ నేల లో ఉన్న లవణాలను గుర్తించి దానికి తగిన పంట వేసుకొని రైతులకు మంచి దిగుబడి రావడానికి నీతి ఆయోగ్ సాల్వ్ హెల్త్ కార్డు ఉపయోగపడుతుందని అన్నారు.స్థానిక ఆశ్రమ బాలుల పాఠశాలలో ఈ సంపూర్ణ అభియాన్ గురించి వ్యాస రచన పోటీలు మరియు పోస్టర్ కాంపిటీషన్ మరియు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభ చూపించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, డీఎంహెచ్ఓ అప్పయ్య, డిడబ్ల్యుఓ స్వర్ణల త లెనిన తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now