అభివృద్ధి పనులకు ప్రభుత్వ భూమి పరిశీలన

Written by telangana jyothi

Published on:

అభివృద్ధి పనులకు ప్రభుత్వ భూమి పరిశీలన

– సారంగపల్లి లో కేంద్రీయ విశ్వ విద్యాలయం కొరకు స్థల పరిశీలన.

– చిన్న గుంటూరు పల్లి లో సమీకృత గురుకులాల విద్యా సంస్థల ఏర్పాటు కోసం స్థల పరిశీలన.

తెలంగాణ జ్యోతి,ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా అభివృద్ధి పనులకు అవసరమైన భూమి పర్శిలించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ములుగు మండలం లోని జగన్నపేట గ్రామ పంచాయి తీ పరిధిలోని సారంగపల్లి లో కేంద్రీయ విశ్వ విద్యాలయం కొరకు 6 ఎకరాల స్థల పరిశీలన చేశారు. అనంతరం కలెక్టర్ చిన్న గుంటూరు పల్లి లో సమీకృత గురుకులాల విద్యా సంస్థల ఏర్పాటు కోసం అవసరమైన 20 ఎకరాల స్థల పరిశీలన చేశారు. అనంతరం ఇంచర్ల లో ఫుడ్ ప్రాసేసింగ్ జొన్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ములుగు తహసిల్దార్ విజయ భాస్కర్, ఆర్ ఐ విజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment