చండ్రుపల్లి హత్య కేసును చేదించిన కాళేశ్వరం పోలీసులు

Written by telangana jyothi

Published on:

చండ్రుపల్లి హత్య కేసును చేదించిన కాళేశ్వరం పోలీసులు

మహదేవపూర్, తెలంగాణజ్యోతి : జయశంకర్ భూపాలప ల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని చండ్రుపల్లి వద్ద గత రెండు రోజుల క్రితం జరిగిన హత్య సంఘటను  పోలీసులు  చేదించారు. కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యా ల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర గ్రామానికి చెందిన హార్వెస్టర్ యజమాని ముత్యాల శ్రీకాంత్ గౌడ్ ను బుధవారం  సాయంత్రం  చంద్రుపల్లి వద్ద కత్తులతో పొడిచి చంపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని కాళేశ్వరం మరియు మహాదేవపూర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తును ముమ్మ రం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితు లను అదుపులోకి తీసుకోని నిందితులను విచారించగా పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన పొన్నం శివకృష్ణ గౌడ్ అనే వ్యక్తి తన స్వగ్రామంలో వాటర్ ప్లాంట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని భార్య వడ్డీలకు డబ్బులు ఇస్తుంటుంది. ఈ క్రమంలో తన భార్య సోదరుడి స్నేహితుడైన ముత్యాల శ్రీకాంత్ కు ఒక లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండటంతో భర్త శివకృష్ణకు భార్యపై అనుమానం కలిగి భార్యను, శ్రీకాంత్ ను పలుమార్లు హెచ్చరించాడు.అయినా వినకుండా తరచుగా ఫోన్లో మాట్లా డడంతో శ్రీకాంత్ ని ఎలాగైనా చంపాలనే ఆలోచనతో తన చిన్ననాటి మిత్రుడు అయిన ఎండి ఫయాజ్ కు విషయం తెలిపాడు. కొమ్మెర గ్రామానికి చెందిన కురుమ సాయికిరణ్ తో స్నేహం ఏర్పరచుకొని శ్రీకాంత్ కదలికలు తెలుసుకుని, బుధవారం ఉదయం శివకృష్ణ, ఫయాజ్ ఇద్దరు కలిసి మోటా ర్ సైకిల్ పై కొమ్మెర గ్రామానికి వచ్చి శ్రీకాంత్ కొరకు రెక్కి నిర్వహించారు.ఇంట్లో లేడని తెలుసుకున్న నిందితులు సా యి కిరాణా షాప్ వద్ద శ్రీకాంత్ ఆచూకీ తెలుసుకొని అక్కడే మద్యం తీసుకొని చండ్రుపల్లి గ్రామం వద్ద ఉన్న శ్రీకాంత్ వద్దకు చేరుకొని తన వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపారు. ఈ సంఘటన జిల్లాలో సంచల నం సృష్టించింది. వెంటనే స్పందించిన పోలీసులు 1) పొన్నం శివకృష్ణ గౌడ్. 2) ఎండి ఫయాజ్. 3) కురుమ సాయి కిరణ్, నిందితులను అదుపులోకి తీసుకొని నిందితుల వద్ద కత్తి, రక్తం అంటిన బట్టలు, హెల్మెట్, రెండు మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మహాదేవపూర్ సిఐ రామ్ చందర్రావు, కాళేశ్వరం ఎస్సై చక్రపాణి, మహదే వపూర్ ఎస్సై పవన్ కుమార్, పలిమెల ఎస్సై తమాషా రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్స్ బాల్ సింగ్, శ్యామ్, అన్వేష్, ధనుంజయ్, కిషన్, హోంగార్డ్స్ లింగ బాబు, శంకర్, స్వామి, వజీర్, బాపు, సిబ్బంది పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now