సరస్వతి పుత్రునికి జ్వాల ట్రస్ట్ ఆర్థిక సాయం

Written by telangana jyothi

Published on:

సరస్వతి పుత్రునికి జ్వాల ట్రస్ట్ ఆర్థిక సాయం

మంగపేట,తెలంగాణ జ్యోతి : రెక్క ఆడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన అనుమల శ్రీకాంత్ కు కర్ణాటక లోని ఎన్ఐటి కాలేజీలో ఎంటెక్ సీటు సాధించాడు.ఖర్చు పెట్టి చదువుకునేంత ఆర్థిక స్తోమత లేదన్న విషయాన్ని తెలుసు కున్న జ్వాల చారిటబుల్ ట్రస్ట్ వారు దాతల సహకారాలతో శ్రీకాంత్ కు ఈరోజు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జ్వాల ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి ఈ సరస్వతి పుత్రునికి సహాయాన్ని అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ప్రధాన కార్యదర్శి రాకేశ్, సభ్యులు యండి ఇంతియాజ్ లు పాల్గొన్నారు.

Leave a comment