వెంకటాపురం ఎంపీడీవోగా జుమ్మిలాల్ నాయక్
వెంకటాపురం నూగూరు, జనవరి 02 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా గుగులోత్ జుమ్మిలాల్ నాయక్ శుక్రవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో వెంకటాపురం ఎంపీడీవోగా విధులు నిర్వహించిన జి. రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ రోజైన డిసెంబర్ 17న కార్యాలయంలో విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో మృతి చెందడంతో, అప్పటి నుంచి ఏటూరునాగారం ఎంపీడీవో శ్రీనివాస్ ఇన్చార్జి ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెంకటాపురం మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ జుమ్మిలాల్ నాయక్‌ను పూర్తిస్థాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయగా, శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన ఎంపీడీవోకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.






