నిరుపేద విద్యార్థినీలకు అండగా జయశంకర్ ఫౌండేషన్

నిరుపేద విద్యార్థినీలకు అండగా జయశంకర్ ఫౌండేషన్

తెలంగాణ జ్యోతి/మహాదేవపూర్ : నిరుపేద విద్యార్థిని లకు అండగా  జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత అందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మహా ముత్తారం మండల కేంద్రానికి చెందిన దుగిని రాజేశ్వరి తన చిన్నతనంలోనే అమ్మానాన్నలు చనిపోవడంతో 5వ తరగతి వరకే చదివి మధ్యలో స్కూల్ మానేసి అప్పటినుండి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తు అప్పుడప్పుడు చదువు కునే పిల్లలను చూసి కంట తడి పెట్టుకునేది చదువు కోవాలని ఉన్న చదివించే వాళ్ళు ఎవరు లేక తనలో తాను కుమిలి పోయేది. అలాగే మహాదేవపూర్ మండలం మెట్పల్లి గ్రామా నికి చెందిన ఏటా కోమలత చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర ఉంటూ కూలి పని చేసుకుం టుంది వీరిద్దరికీ చదువు మధ్యలో మానేసిన నిరుపేద పిల్లలకు జయశంకర్ ఫౌండేషన్ వారు ఎగ్జామ్ ఫీజు కడుతు న్నారని తెలుసుకొని జయశంకర్ ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి వారి విషయం చెప్పడంతో వారి పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి ఇద్దరిని మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ స్కూల్కు తీసుకు వెళ్లి ఓపెన్ టెన్త్ పరీక్ష ఫీజులు చెల్లించారు. 

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment