జన్ జాతీయ గౌరవ్ దివస్ వేడుకలను విజయవంతం చేయాలి
– 15న కేంద్ర మంత్రుల హాజరు
– వైటీసీలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ దివాకర
ములుగు ప్రతినిధి : ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా ఈనెల15న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జన్ జాతీయ గౌరవ్ దివస్ వేడుకలను విజయ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ములుగు మండలం జాకారంలోని సమ్మక్క, సారలమ్మ జాతీ య గిరిజన విశ్వవిద్యాలయం (వైటీసీ) ట్రాన్సిట్ క్యాంపస్ ను మంగళవారం సందర్శించిన కలెక్టర్ ఉత్సవాలకు సంబంధిం చిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ములుగు లోని కలెక్టరేట్ లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అధిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డి, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ సిహెచ్. మహేందర్ జీలతో కలసి అధికా రులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాకారం క్యాంపస్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి జన్ జాతీయ గౌరవ్ దివస్ వేడుకలకు న్ని ఏర్పాట్లు చేయా లన్నారు. ఈనెల 15న జరిగే గిరిజన స్వాతంత్ర్య సమరయో ధులు బిర్సా ముండా జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రభుత్వ బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పాల్గొననున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంతకు ముం దు జిల్లా కలెక్టర్ దివాకర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డితో జాకారం వైటీసీ క్యాంపస్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, డీపీ వో దేవరాజ్, ఏటీడీఓ దేశీరాం, జిల్లా అధికారులు, తహసి ల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.