రైతు వేదిక కాదది..మందు బాబులకు అడ్డా అది…

Written by telangana jyothi

Published on:

రైతు వేదిక కాదది..మందు బాబులకు అడ్డా అది…

తెలంగాణ జ్యోతి ఖానాపూర్ : మండల కేంద్రంలోని అశోక్ నగర్ లో ఏర్పాటు చేసిన రైతు వేధిక మందు బాబులకు అడ్డగా మారింది. మంగళవారం రాత్రి సమయంలో రైతు వేదిక ఆవరణలో గుర్తుతెలియని మందుబాబులు మద్యం సేవించి మద్యం బాటిల్లను పగలగొట్టి కిటికీ నుండి రైతు వేదికలో విసిరేశారు. బుధవారం ఉదయం ఏఓ నాగమణి తన విధులు నిర్వహించడానికి రైతు వేదికకు వచ్చి తలుపు లు తెరిచి చూసేసరికి మద్యం బాటిల్స్, గాజు పెంకలు రూము అంతా చెల్లాచెదురుగా పడి ఉండడంతో కంగుతింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా స్పందించిన ఎస్సై సిహెచ్ రఘుపతి హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని పగలగొట్టిన మద్యం బాటిలను రైతు వేదికలో పడి ఉన్న గాజు పెంకలను పరిశీలించారు. అనంతరం దర్యాప్తు చేపడ తామని ఏవో నాగమణికి కి హామీ ఇచ్చారు.

 – మందు ప్రియులకు అడ్రస్ రైతు వేదిక 

రైతు వేదిక మందు బాబులకు అడ్డగా మారిందని రైతు వేదిక దగ్గర ఆకతాయిలు, అర్ధరాత్రి వరకు మద్యం సేవిస్తూ అరుపులు కేకలు పెడుతున్నారని స్థానికులు తెలిపారు. ఇటు వైపు ఏ ఒక్క పోలీసులు పెట్రోలింగ్ కు వస్తారని భయం కూడా యువతలో లేదని, దీనివల్ల విచ్చలవిడిగా అర్ధరాత్రి వరకు మద్యం సేవిస్తూ సిగరెట్లు తాగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు తెలిపారు. పోలీసులు కన్నేసి ఆక తాయిల ఆగడాలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు

Leave a comment