మొక్కను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది
-లక్ష్మీపురం పంచాయతీ కార్యదర్శి జాడి రమేష్
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : మొక్కని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని లక్ష్మీపురం పంచాయతీ కార్యదర్శి జాడి అన్నారు. ఆదివారం వెంకటాపూర్ మండలం లోని లక్ష్మిపురం గ్రామంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఏవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఉపాధి కూలీలచే మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా కార్యదర్శి రమేష్ మాట్లాడారు. చెట్లను పెంచడం వలన స్వచ్ఛమైన గాలి లభిస్తుందని అన్నారు .ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అటవీ సంపా దన కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటుందన్నారు. స్వచ్ఛమైన గాలినీ పీల్చడం వలన అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. నాటిన మొక్కలను కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు భాస్కర్, రాధిక, గ్రామస్తులు రత్నం సురేందర్ ,హేమ రమేష్ ,పోరిక చిన్న సమ్మయ్య, అజ్మీర శ్యామల నాయక్, రక్తం రాజయ్య ఉపాధి కూలీలు ఉన్నారు.