రాష్ట్ర బడ్జెట్ లో ఆదివాసీలకు అన్యాయం
– 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
– తుడుందెబ్బ రాష్ర్ట అధ్యక్షుడు వట్టం ఉపేందర్
ములుగు ప్రతినిధి : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిం దని, 10శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడం దారుణ మని తుడుందెబ్బ (ఆదివాసీ హక్కుట పోరాట సమితి) రాష్ర్ట అధ్యక్షుడు వట్టం ఉపేందర్ ఒక ప్రకటనలో విమర్శిం చారు. గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తీర్మాణం చేసి గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మాణించారని, ఆ తీర్మాణా న్ని ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. బడ్జెట్ కేటాయింపులో రూ.2,91,159కోట్లు కేటాయించగా ఆదివాసీ గిరిజనులకు 10శాతం ప్రకారంగా రూ. 29,115 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 6శాతం గిరిజన రిజర్వేషన్ ను పరిగణలోకి తీసుకొని కేవలం రూ.17,056కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం గిరిజనాభివృద్దికి తోడ్పడుతామని, ఐటీడీఏలకు పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రకటించి అన్యాయం చేశారన్నారు. ప్రస్తుతం కేటాయించిన నిధులను ఏజెన్సీ ప్రాతాలలో విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ఖర్చు చేసేలా ఐటీడీఏల ద్వారా ఖర్చు చేయాలని ఉపేందర్ డిమాండ్ చేశారు. లేనట్లయితే గిరిజన ప్రజాప్రతినిధులను నిలదీస్తామని పేర్కొన్నారు.