ములుగు మెడికల్ కాలేజీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
– ఆగస్టు 1లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచన
ములుగు ప్రతినిధి : ములుగులోని ప్రభుత్వ వైద్య కళాశాల లో వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయుటకు డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సైపల్ డాక్టర్ బి.మోహన్ లాల్ తెలిపారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు గాను ప్రొఫెసర్లు 15, అసోసియేట్ ప్రొఫెసర్లు 9, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 55, సీనియర్ రెసిడెంట్లు 19 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నామని తెలిపారు. ఆయా పోస్టులకు సంబంధించిన వయస్సు, విద్యా అర్హతలు (ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డీఎంబీ) ఇతర పూర్తి వివరాలు https://mulugu. telangana.gov.in/ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని, అర్హులైన డాక్టర్ అభ్యర్థులు ఈనెల 26న ఉదయం 10.30గంటల నుంచి ఆగస్టు 1, 2024 సాయంత్రం 5గంటల వరకు ములుగులోని ఏరియా ఆస్పత్రిలోగల ప్రభుత్వ వైద్య కాలేజీ ప్రిన్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను సంప్రదించాలని కోరారు.