బిట్స్​ స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Written by telangana jyothi

Published on:

బిట్స్​ స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

– అలరించిన విద్యార్థుల వేషధారణలు

ములుగు ప్రతినిధి : బిట్స్ స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గురువారం ములుగు లోని బిట్స్​ హైస్కూల్​ లో ప్రిన్సిపల్ కె.రజినీకాంత్​ ఆధ్వర్యంలో, ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపల్ జి.కవిత ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహిం చిన వేడుకల్లో విద్యార్థులు జాతీయ నాయకుల వేష ధారణ ల్లో అలరించారు. మహాత్మాగాంధీ, భారతమాత, భగత్ సింగ్, నేతాజీ సుభాష్​ చంద్రబోస్​, తదితర వేషధారణల్లో విద్యార్థు లు ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థులు వేసిన భారత ఆర్మీ ప్రత్యేక స్కిట్ అలరించింది. విద్యార్థులు జాతీయ భావాలను, దేశభక్తిని పెంపొందించు కోవాలని, ఎందరో వీరుల త్యాగాల తో దేశానికి స్వాతంత్ర్యం లభించిందని ప్రిన్సిపల్స్​ రజినీ కాంత్, కవిత పేర్కొన్నారు. వ్యక్తిగత నిర్మాణంతోపాటు చదువుల్లో రాణించి తల్లి దండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహర్షి విద్యాసంస్థల కరస్పాండెంట్ తుమ్మ పిచ్చిరెడ్డి, అధ్యాపకులు సంజయ్​, సుధాకర్​, బిట్స్​ స్కూల్​ ఉపాధ్యాయులు లావుడ్య రాజు, పూర్ణేందర్​, భాగ్యలక్ష్మీ, సుష్మ, ఆమని, స్వర్ణలత, తాజున్నీస బేగం, బి.రాజ్​ కుమార్​, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

బిట్స్​ స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now