Mulugu BRS office |  రేపు బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం 

Mulugu BRS office |  రేపు బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం 

ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్ లో నూతనంగా నిర్మించిన బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సోమవారం ఉదయం 11-30 నిమిషాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ములుగు మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్సీ, ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ములుగు జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి, మండల ఎన్నికల ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, మెట్టు. శ్రీనివాస్, సాంబారి సమ్మారావులు హాజరు కానున్నట్లు తెలిపారు. ములుగు మండల ఎంపీపీ, జెడ్పిటిసి, ఎక్స్ జెడ్పిటిసిలు, ఎక్స్ ఎంపీపీలు, జిల్లా అనుబంధ సంఘాలు, మండల అనుబంధ సంఘాలు, ఎంపిటిసిలు, ఎక్స్ ఎంపీటీసీలు, ఎక్స్ మండల అధ్యక్షులు, ఆత్మ చైర్మన్లు, ఎక్స్ ఆత్మ చైర్మన్లు, సర్పంచులు, ములుగు పట్టణ ముఖ్య నాయకులు మండలంలోని ప్రతి గ్రామ కమిటీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment