సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల జాతర రూట్ డైవర్షన్
ములుగుప్రతినిధి, జనవరి17, తెలంగాణజ్యోతి:మేడారం మహా జాతర పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి ఈనెల 18న వస్తుండటంతో పోలీసులు వన్ వే విధించారు. తాడ్వాయి మండల కేంద్రం నుంచి మేడారం కు భక్తులకు అనుమతి లేదని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వెల్లడించారు. అదేవిధంగా మేడారం గద్దెల వద్దకు వచ్చే భక్తులు ములుగు, గోవిందరావు పేట, పస్రా మీదుగా వయా నార్లాపూర్ మేడారం చేరుకోవాలన్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం తిరిగి నార్లాపూర్, బయ్యక్కపేట మీదుగా భూపాలపల్లి చేరుకొని అక్కడి నుంచి గమ్య స్థానాలకు చేరుకోవచ్చని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఈనెల 18, 19న మేడారంలో పర్యటించనున్న నేపథ్యంలో వన్ వే అమలులో అమలులో ఉంటుందని, భక్తులు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.






