గిరిజన సంక్షేమ చట్టాలకు విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆగని అక్రమ నిర్మాణాలు
– ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గురువారం తహసిల్దారు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏఎస్పి ఆధ్వర్యంలో అంద జేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ వెంకటాపురం మండ ల కేంద్రంలో వెంకటాపురం (జెడ్) సర్వేనెం 68,45,69 ప్రభుత్వ భూములలో వలస గిరిజనేతరులు, బహుళ అంతస్థులు నిర్మి స్తుంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్వవహరిస్తు న్నారని మండిపడ్డారు. ఇటీవల కాలంలో కబ్జాదారులు ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే వెంచర్లు చేసి క్రయా విక్రయాలకు సిద్ధమ య్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70, పేసా చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరారు.ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన రెవిన్యూ అధికారులు బాధ్య తా రహితంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు ఆక్రమనకు గురవుతున్న రెవె న్యూ అధికారుల్లో చలనం లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమనకు గురికాకుండా చర్యలు తీసుకొని అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల ఆక్రమించిన గిరిజనేతరులపై ఎల్. టి. ఆర్ .కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, పూనెం అర్జున్, బొగ్గుల రాజ్ కుమార్, తాటి నాగరాజు, సూరిటి నవదీప్, తదితరులు పాల్గొన్నారు.