ఇక్కడ అక్రమ నిర్మాణాలు షరా “మామూళ్లే” 

ఇక్కడ అక్రమ నిర్మాణాలు షరా "మామూళ్లే" 

ఇక్కడ అక్రమ నిర్మాణాలు షరా “మామూళ్లే” ..!

– రేగులగూడెం లో నిర్మాణ పనిముట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామ పంచా యతీలోని గంగారం క్రాస్ రోడ్ వద్ద ఏలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఇండ్లు ఆగేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. ఇటీవల రేకులగూడెం గ్రామంలో గ్రామపంచాయతీ నుండి అనుమతులు తీసుకోకుండానే అనేక ఇండ్లు నిర్మిస్తున్నా రు. కాటారం మండలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో రేగులగూడెం గ్రామపంచాయతీ ఒకటి. అలాంటి గ్రామ పంచాయతీలో ఏలాంటి అనుమతులు లేకుండా ఇండ్లను నిర్మిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. కాటారం, మంథని ప్రధాన రహదారి కావడంతో గత 5 సంవత్సరాల కాలం నుండి అనేకమంది లక్షల రూ. చెల్లించి ప్లాట్లను కొనుగోలు చేశారు. దేవరాంపల్లి గ్రామం నుండి కొండం పేట రోడ్డు వరకు సుమారు 120 ఇండ్లను గ్రామ పంచాయతీకి ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఇంటి నిర్మాణాలను చేపట్టారు. గ్రామపంచాయతీ నుండి అనుమతులను పొందకున్నప్పటికీ సదరు ఇండ్లకు ట్రాన్స్ కో అధికారులు మాత్రం విద్యుత్తును అందించారు. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు అధికారులు స్పందించి నిర్మాణ పనిముట్ల ను కార్యాలయాలకు తరలిస్తు న్నారే తప్ప కఠిన చర్యలు చేపట్టక పోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామపంచా యతీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న యజమా నులకు పలుమార్లు నోటీసులు జారి చేసినట్లు మండల పంచా యతీ అధికారి వీరస్వామి శుక్రవారం పేర్కొన్నారు. అలాగే నిర్మాణ పనిముట్లు, మెటీరియల్ గ్రామపంచాయితీకి తరలించ డం కొసమెరుపు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment