ఐసిడిఎస్ వెంకటాపురం ప్రాజెక్ట్ పరిధిలో అక్రమ బిల్లులపై విచారణ జరపాలి

ఐసిడిఎస్ వెంకటాపురం ప్రాజెక్ట్ పరిధిలో అక్రమ బిల్లులపై విచారణ జరపాలి

ఐసిడిఎస్ వెంకటాపురం ప్రాజెక్ట్ పరిధిలో అక్రమ బిల్లులపై విచారణ జరపాలి

– ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఐసిడిఎస్ కార్యాలయం పరిదిలోని అక్రమ బిల్లులపై విచారణ జరిపించాలని సోమవారం వెంకటాపురం కార్యాలయంలో ములుగు జిల్లా పర్యవేక్షణ అధికారికి మెమోరాండం అందజే శారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ నేత పర్షిక సతీష్ మాట్లాడుతూ వెంకటాపురం ప్రాజెక్టు అంగన్వాడి కేంద్రాలలో సిబ్బంది సమయపాలన పాటించాలని, మరియు చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలని, 0-6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల ఉన్న పిల్లలకు గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు ఐసిడిఎస్ పథకం కింద నాణ్యమైన పోషకాహారం మెనూ ప్రకారం అందించాలని వినతిపత్రం లో కోరారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో కొన్ని అంగన్వాడి కేంద్రాల్లో అంగన్వాడి టీచర్లు, సిబ్బంది సకాలంలో సమయపాలన పాటించడం లేదని, అలాగే సూపర్వైజర్స్, డి డబ్ల్యు ఓ 2023సం. నుండి 2024 సం. వరకు ఐసిడిఎస్ వెంకటాపురం ప్రాజెక్ట్ పరిధిలో అక్రమ బిల్లులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, నాగరాజు, సురిటీ నవదీప్, బొగ్గుల రాజ్ కుమార్, సోర్లం మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “ఐసిడిఎస్ వెంకటాపురం ప్రాజెక్ట్ పరిధిలో అక్రమ బిల్లులపై విచారణ జరపాలి”

Leave a comment