చినుకు పడితే చిత్తడే..!

చినుకు పడితే చిత్తడే..!

– ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచాలి 

– ఏ ఐ ఎఫ్ డీ ఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్

చెన్నారావుపేట, తెలంగాణ జ్యోతి :  నర్సంపేట డివిజన్ చెన్నారావుపేట మండల కేంద్రంలో ‌ ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ అభివృద్ధి పరచాలని.  ఏ ఐ ఎఫ్ డీ ఎస్. (అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య) ఆధ్వర్యంలో చెన్నా రావుపేట జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు.ఈ సంద ర్భంగా వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్   మాట్లాడు తూ  చినుకు పడితే చిత్తడే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని అమ్మ ఆదర్శ  ద్వారా  ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచాలని,అధిక నిధులు కేటాయించాలని  ప్రభు త్వ విద్యా విధానాన్ని కాపాడాలని అన్నారు. గ్రౌండ్ వాటర్ తో బురదతో నిండి  పోతున్నాయని విద్యార్థులు నడవలేని పరిస్థితి ఏర్పడుతున్నది అని అన్నారు. వర్షం  వరద మొత్తం స్కూల్లోకి  రావడం ‌ ద్వారా స్కూల్  మొత్తం చెరువు లఉంది అన్నారు, పచ్చటి గడ్డి   బురద తో  నిండిపోతున్నది. ‌ విద్యా ర్థులు ఆడుకోవడానికి కనీసం ప్లే గ్రౌండ్ లేకుండా పోతున్నది. స్కూల్లో చదువుకునే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. తక్షణమే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి పాఠశాలను అభివృద్ధి పరచాలని, ఈ గ్రౌండ్ ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే విధంగా విద్యాశాఖ అధికారులు మండల ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో సదుపా యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు,

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment