మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఆదర్శ విద్యార్థులు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్ విద్యార్థులు మట్టి వినాయకులను తయారు చేసి శుక్రవారం ప్రదర్శించారు. మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడదాం.. అనే నినాదంతో విద్యార్థులు స్వయంగా మట్టితో విగ్రహాలను తయారు చేశారు. తాము తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను పూజల కోసం పలువరికి అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో తయారు చేసిన విగ్రహాలను జలవనరుల్లో నిమజ్జనం చేస్తే కాలుష్యం పెరుగుతుందని, విద్యార్థులు ఇప్పటి నుంచే పర్యావరణంపై అవగాహన కల్గి ఉండటం అవసరమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావులు అన్నారు. అనంతరం విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందించారు.