గ్రీన్ వుడ్ పాఠశాలలో హోలీ సంబరాలు.
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : స్థానిక గ్రీన్ వుడ్ పాఠశాలలో హోలీ సంబరాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు వివిధ రకాల సహజమైన రంగులతో ఒకరినొకరు సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే విధంగా సుఖం, దుఃఖం ,సంతోషం, విచారం వీటన్నిటి మేలు కలయికే జీవితం అనే ఉద్దేశంతో రకరకాల రంగులు కలిపిన నీటిని ఒకరిపై ఒకరు చల్లుకొని ఆనందంగా అనురాగ ఆప్యాయతలు కలిసిన పన్నీటి రంగుల జల్లులలో తేలి ఆడారు. ఇట్టి సంబరాలలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్, హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు.