ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గట్టమ్మ వద్ద ఆదివాసీ జెండా ఎగరవేత 

Written by telangana jyothi

Published on:

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గట్టమ్మ వద్ద ఆదివాసీ జెండా ఎగరవేత 

– జెండా ఎగురవేసిన ఆదివాసీ నాయకపోడ్ ములుగు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్

ములుగు ప్రతినిధి : ఆదివాసి నాయకుడు సేవా సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ఆదివాసి నాయకుడు గట్టమ్మ దేవాలయం వద్ద ప్రపంచ ఆదివాసి దినోత్సవం పురస్కరించుకొని జెండా ఎగరవేషారు. ఈ సందర్భంగా కొత్త సురేందర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో ఉన్న విజ్ఞానవేత్తలు అందరూ కలిసి నడుము కట్టి ఆదివాసి సంరక్షణకు కృషి చేయాలన్నారు. ఆదివాసులకు స్వయం నిర్ణయాధికారుల హక్కు ఉండాలని, జీవించాలని , సాంస్కృతి సంప్రదాయాలను భాషలను కాపాడుకోవాలని ప్రకృతి వనరులైన అడవులు నదులు, ఖనిజ సంపద పై ఆదివాసులకు హక్కులు కల్పించాలన్నారు. ప్రపంచ వ్యాప్తం గా 70 దేశాలలో ఐదువేలకు పైగా తెగలు 40 కోట్ల మంది ఆదివాసి ల జనాభా 6700 భాషలు మాట్లాడుతున్నారు. మన భారత దేశంలో 700 తెగలు రకరకాల భాషను మాట్లాడుతున్నారని అన్నారు. మన రాష్ట్రంలో అడవి ప్రాంతాలలో నివసిస్తున్న కోయ, గోండు, నాయక పోడు, పర్ధాన్, చెంచు, ఆంద్, బిల్, తోటి మొదలైన తెగలు ఉండి అడవి ఉత్పత్తులను ఆసరా చేసుకుని ఆదివాసులు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయంగా ఆదివాసీలను ఎదుర్కొంటున్న సమస్య విద్య, ఉద్యోగం,  ఆరోగ్యం, భూమి, సంస్కృతి సాంప్రదాయం పర్యావరణం అంశాలు నేటికీ సమస్యలుగా ఆదివాసులను వెంటాడు తున్నాయని అన్నారు. ప్రపంచంలో ఆదివాసుల వర్ధంతులు, జయంతుల వరకు మాత్రమే కొనసాగుతున్నాయని, కానీ వారి హక్కులు కానరాని దూరంలో ఉండి, అందని ద్రాక్ష ఫలం గానే ఐటీడీఏలు ఉన్నాయని అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు . భారత రాజ్యాంగ ప్రకారం ఐదవ షెడ్యూల్ లో ఆదివాసులకు తప్ప ఏ గిరిజనేతరులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకూడదని రాజ్యాంగంలో రాసినప్పటికీ కూడా నేటికీ నోచుకోని పరిస్థితి ఏర్పడింద న్నారు. జీవో నెంబర్ 68 ప్రకారం ఐటిడిఏ పరిధిలో ఉన్న 29 శాఖలలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన ఆదివాసు లకు హక్కులు కల్పించే విధంగా ఐటీడీఏ ద్వారా నోటిఫి కేషన్లు రిలీజ్ చేయాలని అన్నారు. కానీ నేటికీ ఉద్యోగ నోటిఫి కేషన్ల విషయంలో ఆదివాసులకు అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. ఆదివాసుల్లార మన 5వ  షెడ్యూల్లో ఉన్న రాజ్యాంగ హక్కులను కాపాడుకునే విధంగా మనమందరం ఏకధాటిగా పనిచేసి మన హక్కులను సాధించుకునే విధంగా ప్రతిసంవత్సరంకార్యచరణ రూపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం గట్టమ్మ పూజారి కొత్త సదయ్య, అరిగెల సమ్మయ్య , కొత్త రమేష్, కొత్త లక్మయ్య, ఆకుల మొగిలి, కొత్త రవి, కొత్త సారయ్య, ఆకుల రాజు, చిర్రా మహేందర్, అచ్చ లక్మన్, చిర్రా మురళి, అరిగెల శ్రీధర్, కొత్త రాజ్ కుమార్, అచ్చ రాజు, కొత్త సమ్మయ్య, అచ్చ సాంబయ్య, చిర్రా రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment