వెంకటాపురం ఏజెన్సీలో హైటెన్షన్..!

వెంకటాపురం ఏజెన్సీలో హైటెన్షన్..!

వెంకటాపురం ఏజెన్సీలో హైటెన్షన్..!

– పోలీసు బందోబస్తు మధ్య హెలికాప్టర్ లు ల్యాండింగ్

తెలంగాణ జ్యోతి, వెంకటాపురంనూగూరు : ఆపరేషన్ కగార్ లో భాగంగా  మావోయిస్టుల కోసం కేంద్ర భద్రత బలగాలు రెండు రోజుల నుండి సుమారు 5 వేల మంది పోలీసులు కర్రెగుట్టలను చుట్టుముట్టారు. ఏజెన్సీలో హై టెన్షన్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందని ఏజెన్సీ ప్రాంతవాసులు ఆందోళన చెందుతు న్నారు. వెంకటాపురంలోని కస్తూర్బా స్కూలు గ్రౌండ్లో బుధవారం రెండు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యాయి. హెలిపాడ్ కు సుమారు 200 మీటర్లు దూరం నుండే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి హెలిపాడ్ వైపు ఎవరిని రాకుండా కట్టడి చేశారు. మీడియాను సైతం అనుమతించలేదు. కర్రెగుట్టల అడవుల్లో భద్రతా బలగాలు వేల సంఖ్యలో మోహరించి కర్రె గుట్టలను జల్లెడ పడుతున్నారు. సరిహద్దులోని చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ఇతర ప్రాంతాల నుండి బద్రతా బలగాలు కర్రెగుట్టల కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొ న్నట్లు సమాచారం. సుమారు 250 కిలోమీటర్లు పొడవు ఉన్న కర్రే గుట్టలు చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ర, తెలంగాణ సరిహద్దు అడివి ప్రాంతాలను ఆనుకొని దట్టమైన కొండలపై ఉంది. ఇటీవల మావోయిస్టులు కర్రెగుట్టల ప్రాంతానికి ఎవరూ రావద్దని, బాంబులు అమర్చినామని  మావోయిస్టులు ప్రకటన చేయటంతో ప్రభుత్వం భద్రతా బలగా లతో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహి స్తున్నారు. అటవీ ప్రాంతాల  గిరిజనులను పోలీసులు అప్రమత్తం చేసి, అడవుల వైపు రావద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. అయితే వెంకటాపురం కేంద్రంగా హెలికాప్టర్లలో వాటర్ బాటిళ్ళు, ఆహార పదార్థాలు, భద్రతా బలగాలకు చేరవేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఎప్పుడు ఏంజరుగుతుందోనని ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment