మారుమూల గిరిజన గ్రామాలలో పేద పిల్లలకు సహాయం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటూరు నాగారం వాజేడు, వెంకటాపురం మండలాలలో గ్రేస్ సర్వీస్ సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఖమ్మం వారి ఆధ్వర్యంలో మారుమూల గిరిజన పేద పిల్లలకు సహాయం అందజేశారు. వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం, పాత్రపురం, ఉప్పెడు, వీరాపురం, వి.ఆర్.కె పురం, వెంకటాపురం, మరికాల, కొత్తూరు, రామకృష్ణాపురం గ్రామాలలోని వెయ్యి మందికి పైగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విధ్యార్ధులకు దుప్పట్లు, జంతికలు, ఆట బొమ్మలు, తిను బండారాలను వెంకటా పురం పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కొప్పుల తిరుపతిరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థులు విద్యావంతులై, ఉన్నత శిఖరాలను చేరుకో వాలని, మధ్యలో ఏమాత్రం చదువుని మానేయవద్దని, చలికాలంలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడం చాలా సంతోషకరమని అన్నారు. మారుమూల గిరిజన గ్రామా లలో పేద పిల్లలకు సహాయం చేయడానికి ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని, సంస్థకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది, మురళీధర్ రెడ్డి, సతిష్, పాఠశాల ఉపాధ్యాయురాలు, జీవన జ్యోతి గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ముర్రం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.