CHAKRAVARTHI – HNK : హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ లో వైన్నెముఖ నొప్పులకు వైద్యసేవలు

CHAKRAVARTHI - HNK : హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ లో వైన్నెముఖ నొప్పులకు వైద్యసేవలు

CHAKRAVARTHI – HNK : హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ లో వైన్నెముఖ నొప్పులకు వైద్యసేవలు

వరంగల్ ప్రతినిధి,తెలంగాణజ్యోతి : దీర్ఘకాలికంగా ఆర్థరైటిస్, నరాలు, వెన్నెముఖకు సంబం ధించిన నొప్పులతో బాధపడుతున్నవారు హైదరాబాద్ కు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు వరంగల్ చక్రవర్తి ఆస్పత్రిలో ప్రారంభించారు. ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్‌మెంట్ రాకతో వరంగల్ ఆరోగ్య సంరక్షణలో ఒక అద్భుతమైన పురోగతిని సాధించింది, దీర్ఘకాలిక నొప్పికి చికిత్స చేయడానికి ఆధునిక పద్ధతులలో ప్రత్యేకత కలిగిన డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి అనస్థీషియాలజిస్ట్ ,ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్‌మెంట్ నిపుణుడిగా తన నైపుణ్యాన్ని మిళితం చేసి నిరంతర నొప్పి పరిస్థితులతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక పరిష్కా రాలను అందిస్తున్నారు. ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్ మెంట్ లో దీర్ఘ కాలిక నొప్పితో బాధపడుతున్న వారి ఖచ్చితమైన నొప్పి మూలాన్ని గుర్తించి అధునాత ఇమేజింగ్ టెక్నాలజీతో నొప్పిఉన్న ప్రదేశాన్ని గుర్తించి చికిత్సను అందించనున్నట్లు తెలిపారు. గతంలో ఈ వైద్య సేవలు హైదరాబాద్ లోనే ఉండేవని చికిత్సకోసం రోగులు వ్యయ, ప్రయాసలకు ఓర్చి ఎన్నో ఇబ్బం దులు ఎదుర్కొంటూ హైదరాబాద్ కు వెళ్ళేవారని, ఇలాంటి రోగులకు ఇప్పుడు ఈ సేవలు వరంగల్ లో ప్రారంభించడం ఆనందంగా ఉందని డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీర్ఘకాలికంగా నడుం, మెడ, వెన్నెముఖ, నరం లాగడం, మోకాళ్లు, స్పైనల్ కార్డ్, చేతుల్లో తిమ్మిర్లు, భుజంలో తీవ్ర నొప్పి, భిగుసుకుపోవడం, చేతులు పైకి ఎత్తలేకపోవడం, బరువులు ఎత్తలేక పోవడంలాంటి ఆర్థరైటిస్ నొప్పులు కలిగిన వారిని పరీక్షించి ఈ చికిత్స ద్వారా నయం చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment