ఇల్లు కూలిన నిరుపేద వృద్ధుల కుటుంబానికి చేయూత
– అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని ఇప్పల బోరుకు చెందిన నిరుపేద అయిన గంప గౌరయ్య ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షానికి కూలిపోగా ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆ కుటుంబానికి చేయూతను అందించారు. గౌరయ్య భార్య గత ఐదు సంవత్సరాలకు ముందు పక్షవాతం వచ్చి ఒక కాలు ఒక చెయ్యి కూడా పని చేయట్లేదు. అప్పటినుండి ఇంటి వద్దనే ఉంటుండగా, ఒక ప్రమాదంలో గౌరయ్య ఎడమ చేయి కూడా కోల్పోయాడు. వారి పరిస్థితి దయనీయంగా మారడంతో అప్పటినుండి గౌరయ్య కాలేశ్వరం టెంపుల్ వద్ద బిక్షాటన చేస్తూ అతని భార్యను పోషించుకుంటున్నాడు. ప్రస్తుత వర్షాల కారణంగా అతని ఇంటి గోడ కూలిపోవడంతో వృద్ధ దంపతులు కన్నీరు మునీరుగా విలపిస్తుండడంతోడడం విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి కూలిన గోడ మళ్ళీ కట్టుకోవడానికి 5 వేల రూపాయల ఆర్థిక సహా యం అందించారు. ఇకముంందు ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యండమ్మ అని చెప్పి మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.