ఈ నెల 30న ఎంజీఎంలో అపోలో వైద్యులచే గుండెవ్యాధి నిర్థారణ పరీక్షలు 

ఈ నెల 30న ఎంజీఎంలో అపోలో వైద్యులచే గుండెవ్యాధి నిర్థారణ పరీక్షలు 

– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాలరావు

   ములుగు ప్రతినిధి  : ఆర్ బిఎస్ కె డీఈఐసి ఆద్వర్యంలో ఈ నెల 30న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో హైదరాబాద్ అపోలో వైద్య నిపుణులతో గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ములుగు జిల్లా వైద్యాధికారి గోపాల్ రావు తెలిపారు. గుండె సంబంధిత అనారోగ్య సమస్యల నిర్దారణ పరీక్షలను ఆర్ బిఎస్ కె డీ ఈఐసి ఎంజీఎంలో ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు చేస్తారని, గుండె సంబంధ (పుట్టుకతో గుండెలో రంధ్రం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె శబ్దంలో మార్పులు, అప్పుడప్పుడు కండ్లు తిరిగి పడిపోవడం, ఛాతిలో నొప్పి, బరువు పెరగక పోవడం) సమస్యలతో బాధ పడుతున్న వారు ఈ క్యాంపును సందర్శించాలని సూచించారు. చిన్న పిల్లల నుండి 19సం.ల లోపు వయస్సు గల పిల్లలు వారి వివరాలు ఆర్ బిఎస్ కె బృందాలకు తెలియజేస్తే వారిని ఆర్.బి.ఎస్.కె వాహనంలో ఎంజీఎంకు తీసుకెళుతారని, ఈ వైద్య శిబిరంను ములుగు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని డిఎంఅండ్ హెచ్ ఓ కోరారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ఆర్ బిఎస్ కె ప్రోగ్రాం ఆఫీసర్ రణధీర్, కోఆర్డినేటర్ నరహరి, వైద్య బృందం పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment