ఐక్యతను చాటుదాం.. వర్గీకరణను ఆపుదాం…

ఐక్యతను చాటుదాం.. వర్గీకరణను ఆపుదాం...

ఐక్యతను చాటుదాం.. వర్గీకరణను ఆపుదాం…

– జాతీయ మాల మహానాడు భద్రాద్రి జిల్లా కన్వీనర్ తోటమల్ల రమణమూర్తి

తెలంగాణజ్యోతి నూగూరు, వెంకటాపురం : అంబేడ్కర్ వారసులుగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ దళితుల ఐక్యత కు పాటు పడతామని మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ తోట మల్ల రమణమూర్తి అన్నారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో మండల అధ్యక్షుడు మంచాల భూషణం అధ్యక్షతన జరిగిన మాల మహానాడు మండల విస్తృత కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణమూర్తికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా తోటమల్ల రమణమూర్తి మాట్లాడుతూ అంబేడ్కర్ వారసులుగా దళితుల ఐక్యత ఎజెండాగా, ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతి హక్కుల కోసం ప్రజా స్వామ్య పద్ధతుల్లో రాజీలేని పోరాటాలు చేస్తామని యావత్ మాల జాతిని ఒక్క తాటిపైకి తీసుకువచ్చి మాదిగలను రెచ్చగొడుతున్న మనువాదుల కళ్ళు తెరిపిస్తామని అన్నారు. జాతీయ జెండాను, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భారత రాజ్యాంగాన్ని గౌరవించని వారు కులాల కుంపట్లు రగిలిస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణకు మద్దతుగా నిలుస్తూ, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని నీరు గారుస్తున్న వారికి కనువిప్పు కలిగిస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో మాల మహానాడు తీసుకునే అనేక కార్యక్రమాల్లో జాతి యువత విద్యార్థిని విద్యార్థులు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కోకన్వీనర్ ఎడెల్లి గణపతి, మాల మహానాడు సీనియర్ నాయకులు కాల్వ సుందర్ రావు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సాధనపల్లి శ్రీను, మంచాల వెంకట స్వామి, తోట మల్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment