యోగాతో ఆరోగ్యం మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు
-లక్ష్మీదేవి పేట పంచాయతీ కార్యదర్శి దుర్గ ప్రసాద్
తెలంగాణ జ్యోతి, ములుగు : యోగాతో ఆరోగ్యం మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని లక్ష్మీదేవి పేట పంచాయతీ కార్యద ర్శి దుర్గ ప్రసాద్ అన్నారు శుక్రవారం ఉపాధి కూలీలచే అమృత్ సర్వర్ కోయకుంట వద్ద యోగ నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపాధి కూలీలచే ఉదయం పంచాయతీ సెక్రెటరీ దుర్గ ప్రసాద్ ,ఫీల్డ్ అసిస్టెంట్లు కేతిరి రాధిక ,నల్లబెల్లి భాస్కర్ లు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను క్షుణ్ణంగా వివరిం చారు. ఈ సందర్భం గా దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ వ్యాయా మం అనంతరం యోగాను ప్రతిరోజు 30,నుండి 40 నిమిషాలు పాటు నిర్వహిస్తే, మానసిక ఒత్తిడి తట్టుకొని, సంపూర్ణ శక్తివంతులు అవుతారని, సంపూర్ణ ఆరోగ్యవంతు లవుతారని యోగా యొక్క ప్రయోజనాలను విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు చిర్ర గణేష్, మునిగాల రామకృష్ణ ,ముడిగే బంగారి, గుర్రం సమ్మయ్య, గోగు రాజయ్య ,కేతిరి ఎల్లయ్య ,గోగు ఎల్లమ్మ, కేతిరి రాజమ్మ, బీనవేని నరేష్, కనుకుంట్ల నాగయ్య, జాడి సౌడలి, కందికొండ కిష్టయ్య, మల్లయ్య, శ్రీమంతుల తిరుపతి, రెడ్డి లచ్చులు తదితరులు పాల్గొన్నారు.