బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ లో ఘనంగా యోగ దినోత్సవం
తెలంగాణ జ్యోతి, ములుగు : జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగా గురువు శ్రీ గురు హాజరై మనిషి జీవితానికి యోగా ఎంత అవసరమో వివరించి చెప్పారు. విద్యార్థులతో ముచ్చటించిన ఆయన విద్యార్థులతో సూర్య నమస్కారం, కొన్ని ఆసనాలు చేపించారు. ఇంకా జీవితంలో విద్యార్థి తన లక్ష్యసాధనకు ఏ విధంగా సిద్ధపడాలో ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం అంబటి కోటిరెడ్డి, మహమ్మద్ హఫీజ్, ఉపాధ్యాయు బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.