అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు
- మంత్రి సత్యవతి రాథోడ్
డెస్క్ : అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం బాలురకు సమానంగా బాలికల విద్యకు, విద్యా సంస్థలలో డిజిటల్ విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ కల్పిస్తున్నామని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. బాలిక విద్యను ప్రోత్సహించడం లో భాగంగా పదో తరగతి, ఇంటర్‌లో టాపర్ గా నిలిచిన బాలికలకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ చర్యలు వల్లే బాలికల నిష్పత్తి గణనీయంగా పెరుగు తోందని తెలిపారు. బాలికల పట్ల దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.