హనుమాన్ భక్తుల పాదయాత్ర
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలానికి చెందిన ఆంజనేయ స్వామి భక్తులు బుధవారం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగేట టువంటి కళ్యాణాన్ని తిలకించేందుకు స్వాములు పాద యాత్రగా బయలుదేరారు. స్వాములు తలపెట్టిన పాదయాత్రను మంత్రి దనసరి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంపల శివ, అంజన్న, గురు స్వాములు ఇర్సవడ్ల సంతోష్, నాగరాజు, రాజేష్ సాధన పెళ్లి బక్కయ్య లతోపాటు 70 మంది ఆంజనేయ స్వామి భక్తులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న, మండల అధ్యక్షులు రఘు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.