గ్రూప్-3 పరీక్ష పగడ్బందీగా నిర్వహించాలి

Written by telangana jyothi

Published on:

గ్రూప్-3 పరీక్ష పగడ్బందీగా నిర్వహించాలి

భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ఈ నెల 17, 18 తేదీల్లో టిజిపిఎస్సి నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్ష ప్రశాంతం గా పగడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని టిజిపిఎస్సి కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి, కార్యదర్శి నికోల స్ తెలిపారు. గ్రూప్ 3 పరీక్ష నిర్వహణపై బుధవారం టిజిపి ఎస్సి కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పి, ప్రాంతీయ కో ఆర్డినెటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 14001 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 5 లక్షల 36 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. దివ్యాన్ లకు 10+2 అర్హతలు కలిగిన అభ్యర్థులను స్క్రైబ్స్ గా నియమించాలని, స్క్రైబ్స్ నోడల్ అధికారి, అదనపు కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేయాలని అన్నా రు. పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను నిశిత తనిఖీ చేయాలని, సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం12.30 గంటల వరకు పేపర్ 1 ఉంటుం దని, పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసి వేయాలని తెలిపారు. అభ్యర్థులను 8.30 గంటల నుండే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. అలాగే 17వ తేది సాయంత్రం 3 గంటల నుండి 5.30 గంటల వరకు పేపర్ -2 పరీక్ష ఉంటుందని పరీక్ష కేంద్రం గేట్లు మధ్యాహ్నం 2.30 గంటలకు మూసివేస్తారని అన్నారు. అభ్యర్థులును 1.30 నుండి అనుమతిస్తారని తెలిపారు. 18వ తేదీన పరీక్షకు ఉదయం 9.30 గంటలకు గేట్లు మూసివేస్తారని అన్నారు. అభ్యర్థులను ఉదయం 8:30 గంటల నుండి అనుమతిస్తారని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ ఐడీల తో పరీక్ష కేంద్రంకు రావాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఏర్పాట్లుపై జిల్లా కో ఆర్డినేటర్, నోడల్ అధికారితో టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు నిర్వహణపై సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతంగా పరీక్ష జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయను న్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం టిజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై చైర్మన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసి కార్యాలయం నుండి హాజర య్యారు. జిల్లాలో పరీక్ష నిర్వహణకు 17 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 3707 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. 17 మంది పరిశీలకులు, 34 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఒక బయో మెట్రిక్ సూప ర్వైజర్, 5 రూట్లుగా విభజించి 5 మంది రూటు అధికారులను నియమించినట్లు తెలిపారు. అనంతరం ఐడీఓసి కార్యాల యంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమును పరిశీలిం చారు. ఈ సమావేశంలో ఎస్పి కిరణ్ ఖరే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పరీక్షల ప్రాంతీయ కో ఆర్డినేటర్ వెంకన్న, పోలీస్ నోడల్ అధికారి బోనాల కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now