చెకుముకి ప్రతిభా పరీక్ష నిర్వహణ
– విద్యార్థులు విజ్ఞానం పట్ల అవగాహన పెంచుకోవాలి
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మండలం లోని జెడ్ పి హెచ్ ఎస్ కాటాపూర్ పాఠశాల విద్యార్థులకు పాఠశాల స్థాయిలో జన విజ్ఞాన వేదిక నిర్వహించు చెకుముకి ప్రతిభా పరీక్షను బుధవారం నిర్వహించారు. ఈ పరీక్షను ఇంచార్జీ ప్రధాన ఉపాధ్యాయులు బి సక్రు నాయక్, టీఎస్ యుటిఎఫ్ తాడ్వాయి మండలం అధ్యక్షులు సుతారి పాపారావు అధ్యక్ష తన జరిగింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ అధ్యక్షుడు పాపా రావు మాట్లాడుతూ విద్యార్థులకు విజ్ఞానం పట్ల అవగాహన పెంపొందించడం కొరకు, విజ్ఞానం పట్ల ఆసక్తి పెంచుకొనుట కొరకు ఈ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. సమా జంలో జరుగుతున్నటువంటి మూడ నమ్మకాల పట్ల అవగా హన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు తార్కిక ఆలోచన గణితపరమైనటువంటి భావనలను పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యా ర్థులు మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయిలో పోటీపడా లన్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఎస్ కే నిజాముద్దీన్, ఎండి హర్షిణి, టి రామ్ చరణ్ ,ఎండి సమరీన్ ఎస్.కె నిస్రుద్దీన్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అక్బర్ పాషా, జీవన్ లాల్, శ్రీదేవి, రాజేష్, వెంకటేశ్వర్లు, జైపాల్, శ్యాంసన్, తదితరులు పాల్గొన్నారు.