ప్రభుత్వ భూమిలో గ్రావెల్ తవ్వకాలు – జెసిబి పట్టివేత. 

Written by telangana jyothi

Published on:

ప్రభుత్వ భూమిలో గ్రావెల్ తవ్వకాలు – జెసిబి పట్టివేత. 

– వాల్టా చట్టం కింద కేసు నమోదు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని అంకన్న గూడెం గ్రామపంచాయతీ పరిధి ప్రభుత్వ భూమిలో అక్రమం గా జెసిబి తో గ్రావెల్ తోలకాలు జరుగుతున్నాయని, విశ్వసనీ య సమాచారంతో వెంకటాపురం రెవిన్యూ అదికారులు అప్ర మత్తం అయ్యారు. మండల తహసిల్దార్ లక్ష్మీ రాజయ్య ఆదే శాలమేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య సిబ్బందితో కలిసి అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న జీసిబిని సీజ్ చేశారు.ఈ సందర్బంగా తహసీల్దార్ లక్ష్మి రాజయ్య మాట్లాడుతూ మండల పరిధిలో అక్రమంగా గ్రావెల్, ఇసుక రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపురమైన కేసులు పెడతామని ఈ సందర్భంగా మీడియా కు తెలియజేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now