గుమ్మల్లపల్లి రహదారి నిర్మాణం పనులు చేపట్టాలి
– ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు
– పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరన్
కాటారం,తెలంగాణజ్యోతి ప్రతినిధి:కాటారం నుంచి గుమ్మ ల్లపల్లి రహదారి నిర్మాణం పూర్తి కాక పోవడం తో ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతు న్నారని, రోడ్డు నిర్మాణం మధ్యలో ఆపి కంకర పోయడంతో ప్రజలు వాహనదారులు అనేక ఇబ్బందులకు, ప్రమాదాలకు గురవుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరన్ అన్నారు. నిత్యం కాటారం నుంచి గుమ్మల్లపల్లికి వెళ్లే వాహ నదారులు జారి పడుతున్నారని అన్నారు. వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సమరశీల పోరాటా లు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎ ఫ్ఐ మండల అధ్యక్షుడు ఈశ్వర్, డివిజన్ కార్యదర్శి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.