ఘనంగా పోచమ్మ బోనాలు
– అమ్మవారికి ప్రత్యేక మొక్కులు
ములుగు ప్రతినిధి : ములుగు మండల వ్యాప్తంగా ప్రజలు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంతోపాటు మండలంలోని మహమ్మద్ గౌస్పల్లిలో డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు మంగళ హారతులు, బోనాలతో తరలివచ్చి పోచమ్మతల్లికి నైవేద్యం, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొబ్బరికాయలతో పాటు కోడి, యాట మొక్కులు చెల్లించు కున్నారు. పంటలు సమృద్ధిగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు.