చిన్న గొల్లగూడెం లో ఘణంగా మైసమ్మ బోనాలు

Written by telangana jyothi

Published on:

చిన్న గొల్లగూడెం లో ఘణంగా మైసమ్మ బోనాలు

– మొక్కులు చెల్లించుకున్న భక్తులు

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పంచాయతీపరిధి లోనీ చిన్న గొల్లగూడెంలో ఆదివారం మైసమ్మ తల్లి బోనాల ఉత్స వాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. డప్పు, సన్నా యి మేళాల దరువులతో మహిళలు బోనాలతో ఊరేగిం పుగా బయలుదేరి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చాలని ఈ ఏడాది పాడి పంటలు బాగా పండాలని, సకల జనులు సుఖశాంతులతో ఉండాలని అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలని, అమ్మ వారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేళ ఎర్రమ్మ తల్లికి కోళ్ల బలిదానాలు చేశారు. బోనాల వేడుకలు సందర్భంగా చుట్టుపక్కల నుండి పెద్ద సంఖ్యలో మహిళా సోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో అందంగా అలంకరించిన బోనాలు ఎత్తుకొని రావటంతో గ్రామంలో బోనాల సందడి నెలకొంది.

Leave a comment