మేడారంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
– యువజన సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
తాడ్వాయి, తెలంగాణజ్యోతి : మండలంలోని మేడారంలో అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించగా ముగ్గుల పోటీలలో పెద్ద ఎత్తున మహిళ లు పాల్గొన్నారు. విజేతలుగా కె. శ్రావ్య, కె. శ్రీలేఖ, ప్రశాంతి, మౌనిక, జ్యోతి, అనితలు నిలిచారు. ముఖ్య అతిథులుగా మేడారం గ్రామ మాజీ సర్పంచ్ చిడం బాబురావు, హైకోర్టు లాయర్ చందు, మేడారం పూజారులు సిద్ధబోయిన అరుణ్, సిద్ధబోయిన రమేష్, కొక్కెర రమేష్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన బోజరావు, యువజన సంఘం సభ్యు లు అనిల్,శంకర్, సునీల్, వినోద్, గిరి,సమ్మారావ్, గ్రామ పెద్దలు ,తదితరులు పాల్గొన్నారు.