నూతన సర్పంచ్ లకు ఘన సన్మానం. : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
కాటారం, డిసెంబర్ 19, (తెలంగాణ జ్యోతి) : పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధుల గెలుపుపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి మంథని పట్టణంలోని రాజగృహాలో నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం యత్నారం మరియు కాటారం మండల కేంద్రం గ్రామపంచాయతీల్లో విజయం సాధించిన సర్పంచ్ లు దయ్యం సుమిత్ర శ్రీనివాస్, పంతకాని సడవలిలను మరియు వార్డు సభ్యులను ఆయన శాలువాలు పూల మాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం నమ్మకం ఉందని తేలిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికలు చెంప పెట్టులాంటివని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు….






